English   

చెర్రీ అందుకే పెళ్లి చేసుకున్నాడు తెలుసా ?

ramcharan
2019-06-02 16:07:35

టాలీవుడ్ స్టార్ హీరో రామ చరణ్, ఆయన భార్య ఉపాసనలు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ పెళ్లి రోజు  వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో ఆనందిస్తూ గడుపుతూ, ఎప్పటికప్పుడు తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా, రెండు సింహం పిల్లలతో ఆడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన, దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది. "ఇప్పుడు తెలిసిందా మీకు మిస్టర్‌ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో?" అని పోస్ట్ చేసింది. ఈ ఆఫ్రికా పర్యటన తమకెన్నో పాఠాలు నేర్పింది. ప్రకృతిని, జంతువులను గౌరవించాలని, వాటిని కాపాడుకునేందుకు మనవంతు ఏదన్నా చేసే సమయం వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. అంటే   సింహం పిల్లలతో కూడా పట్టుకునేంత ధైర్యం తనకు ఉన్నది కాబట్టే చరణ్‌ తనను పెళ్లి చేసుకున్నాడని ఉపాసన కవి హృదయం అన్నమాట. నిజానికి ఉపాసన చరణ్ వివాహం నాటికి ఉపాసన కాస్త అందంగా ఉండేవారు కాదు, అయితే సాధారణంగా హీరోల అభిమానులు తమ హీరోలు కూడా అందగత్తె లుగా ఉండాలని అనుకుంటారు, కానీ ఆమె అందంగా లేరనే భావనతో ఈమెను ఎలా చేసుకుంటున్నాడు అనే విధంగా చరణ్ ని అప్పట్లో ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆమె తన మంచి పనులతో మంచి మనస్తత్వం తో అందరి మనసులు గెలుచుకుంది. అయితే ఆఫ్రికా పర్యటన నుంచి వచ్చిన తరువాత చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

More Related Stories