English   

పోసానికృష్ణ మురళి కి ఆ పదవి దక్కేనా ?

posani
2019-06-02 16:28:54

మొన్న జరిగిన ఏ పీ ఎన్నికల సమయంలో సినీ రంగానికి చెందిన పోసాని, మోహన్‌ బాబు, జయసుధ, జీవిత, రాజశేఖర్‌, అలీ, పథ్వీ, కృష్ణుడు, కొన వెంకట్, చిన్ని కృష్ణ సహా పలువురు వైసీపీ తరపున ప్రచారాన్ని నిర్వహించారు. పోసాని కృష్ణ మురళి ప్రచారం వేయలేదు కానీ జగన్‌కి సపోర్ట్‌గా  చాలా సార్లు ప్రెస్ మీట్ లు పెట్టీ తెలుగుదేశం పార్టీ అవినీతిని ఎండకట్టాడు. మొత్తానికి ఏదైతేనేం  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరిచింది. పార్టీ అధికారంలోకి రావడంతో తమకు కీలకపదవులు దక్కుతాయని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. రీసెంట్‌గా ఆంధప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి అంబికా క్రిష్ణ రాజీనామా చేసిన నేపథ్యంలో  ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ పదవి ఎవరికి దక్కేనో ? అని అనుకుంటున్నారు. ఎఫ్‌.డి.సి చైర్మన్‌ పదవికి పోసాని సూట్ అవుతాడని అని జగన్‌ భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రి లో ఉన్న పోసానిని ఆ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణ రెడ్డి పరామర్శించగా ఈ విషయం చెప్పేందుకే ఆయన వచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇక దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories