English   

నానికి యాక్సిడెంట్.. షాక్‌లో ఉన్న అభిమానులు..

nani
2019-06-03 15:47:08

వరుసగా రెండు పరాజయాల తర్వాత జెర్సీ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నాచురల్ స్టార్ నాని. దాంతో మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. తాజాగా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా హీరో నానికి యాక్సిడెంట్ అయింది. దాంతో దర్శక నిర్మాతలు వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు నానిని తీసుకెళ్లారు. అక్కడ నాచురల్ స్టార్‌ను పరిశీలించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే కాలికి గాయం కావడంతో పది రోజులపాటు విశ్రాంతి అవసరమని చెప్పారు డాక్టర్లు. దాంతో షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు చిత్రయూనిట్.
నాని పూర్తిగా కోలుకున్న తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జెర్సీ సినిమా తర్వాత మరోసారి నాని సినిమాకు అనిరుధ్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు. మనం సినిమా తర్వాత సరైన విజయం అందుకోలేని విక్రమ్ కె.కుమార్.. నాని సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆలోచిస్తున్నాడు. ఈ సినిమా కూడా పూర్తిగా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో నాని దొంగగా నటిస్తున్నాడు. ఐదుగురు ఆడవాళ్ళ చుట్టూ తిరిగే కథ ఈ గ్యాంగ్ లీడర్. మొత్తానికి నాని యాక్సిడెంట్ గురించి తెలిసి అభిమానులు కంగారు పడుతున్న వేళ ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

More Related Stories