English   

బాల‌య్య హీరోయిన్ హాస్పిట‌ల్‌లో.. లేనిపోని టెన్షన్ అభిమానుల్లో..

sneha
2019-06-03 16:00:31

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ స్నేహా ఉల్లాల్. జూనియర్ ఐశ్వర్యారాయ్ అంటూ బాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ అవకాశాల వేటలో మాత్రం ఎప్పుడూ వెనకే ఉంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాలు చేసింది స్నేహాఉల్లాల్. బాలకృష్ణ నటించిన సింహా బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా స్నేహ ఉల్లాల్‌కు అవకాశాలు అసలు రాలేదు. దాంతో హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్నేహ ఉల్లాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో అభిమానులకు షేర్ చేసింది. జీవితంలో తొలిసారి తాను హాస్పిటల్‌లో జాయిన్ కావాల్సి వచ్చిందని.. సెలైన్ బాటిల్ కూడా ఎక్కించుకున్నాను అంటూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తీవ్రమైన జ్వరం కారణంగా స్నేహ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఈ భామ. ఇవి చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలని విషెస్ పంపిస్తున్నారు.

More Related Stories