English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఫాలో అవుతున్న హీరో శ‌ర్వానంద్..

pk
2019-06-03 16:29:11

తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్రెండ్ సెట్ట‌ర్. సినిమాల విష‌యంలోనే కాదు.. ఆయ‌న లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్. ముఖ్యంగా హాలీడేస్ ఉన్న‌పుడు త‌న పొలం ప‌నుల‌తో బిజీగా ఉంటాడు ఈ హీరో. అక్క‌డ పండిన మామిడి ప‌ళ్ల‌ను ప్ర‌తీ వేస‌విలో త‌నకు కావాల్సిన వాళ్ల‌కు పంపిస్తాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు ఇదే దారిని కుర్ర హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. తాజాగా శ‌ర్వానంద్ కూడా ఇదే చేసాడు. ఈయ‌న కూడా త‌న‌కు ఇష్ట‌మైన వాళ్ల‌కు.. శ్రేయోభిలాషుల‌కు మామిడి ప‌ళ్ల‌ను గిఫ్టుగా పంపించాడు. అవి అందుకున్న వాళ్ల‌కు శ‌ర్వాకు సోష‌ల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుట్ట‌లో పెట్టి పంపిస్తే.. ఇక్క‌డ కాట‌న్ బాక్సుల‌లో మామిడి ప‌ళ్ల‌ను పంపించాడు శ‌ర్వానంద్. త‌న తోట‌లో స‌హ‌జ సిద్ధంగా పండిన ప‌ళ్ల‌ను ఇక్క‌డ అంద‌రికీ ఇచ్చాడు శ‌ర్వా. ప్ర‌ముఖ సినిమా పిఆర్వోలు వంశీ శేఖర్‌తో పాటు, త‌న అసిస్టెంట్ రాజ్ కమల్ వాళ్ల‌కు కూడా ఈ ప‌ళ్ల‌ను పంపించాడు శర్వానంద్. మొత్తానికి ప‌వ‌న్ దారిలోనే ఇప్పుడు శ‌ర్వానంద్ కూడా వెళ్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే.. ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్లంద‌రికీ మామిడి ప‌ళ్ల మ‌జా మ‌రింత తెలియ‌డం ఖాయం.

More Related Stories