English   

సాయి ప‌ల్ల‌వికి ఎన్ని క‌ష్టాలో.. ఫిదా బ్యూటీకి హ్యాట్రిక్ ఫ్లాపులు..

pallavi
2019-06-03 19:27:15

వరుస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతుంది టాలెంటెడ్ నటి సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంసీఏ సినిమాతో మరో విజయం అందుకుంది. అయితే ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది. పడిపడి లేచేమనసు డిజాస్టర్ కావడంతో సాయి పల్లవి కెరీర్లో తొలి ఫ్లాప్ మూటగట్టుకుంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా వచ్చిన మారి 2 కూడా ఫ్లాప్ కావడంతో సాయి పల్లవి కెరీర్ సందిగ్ధంలో పడింది. ఇక ఇప్పుడు విడుదలైన ఎన్‌జికే సినిమా కూడా డిజాస్టర్ కావడంతో సాయి పల్లవికి అర్జంటుగా హిట్ కొట్టాల్సిన సమయం ఆసన్నమయింది.

ఇప్పుడు గాని విజయం అందుకోకపోతే కెరీర్‌లో బాగా వెనుకబడిపోయే ప్రమాదం లేకపోలేదు. దానికి తోడు ఈ మధ్య మహేష్ బాబు, అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని ముందు అనుకున్నారు కానీ.. ఈ ముద్దుగుమ్మ తన పాత్ర నచ్చకపోవడంతో మహేష్ బాబు సినిమాను కూడా వదిలేసిందనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నటిస్తున్న ఏకైక సినిమా విరాటపర్వం 1992. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రానా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం సాయిపల్లవి కెరీర్ గాడిలో పడాలంటే ఆమె చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఇదే సినిమా. ఇందులో నక్సలైట్ పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి. మరి ఈ సినిమాతో ఫిదా బ్యూటీ ఎంతవరకు ఫిదా చేస్తుందా అనేది చూడాలి.

More Related Stories