English   

చిరంజీవి కెమెరా మెన్ వైపు చూస్తున్న మ‌హేశ్ బాబు..

mb
2019-06-03 20:22:54

ఇండ‌స్ట్రీలో కొంద‌రు కెమెరా మెన్స్ మాత్రం ఎప్పుడూ స్టార్సే. వాళ్ల కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తుంటారు. అలాంటి సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌త్న‌వేలు. ఆర్య సినిమా నుంచి రంగస్థ‌లం వ‌ర‌కు ఈయ‌న సినిమాలు అద్భుతాలే. ఈయ‌న కెమెరా ప‌నిత‌నానికి స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయి.. నువ్వే కావాలంటారు. ఇప్పుడు కూడా భారీ సినిమాల‌కు ప‌ని చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ర‌త్న‌వేలు. ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాకు ఈయ‌నే సినిమాటోగ్ర‌ఫ‌ర్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌నే కావాలంటూ వ‌స్తున్నాడు మ‌హేశ్ బాబు. ప్ర‌స్తుతం ఈయ‌న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతానికి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సూప‌ర్ స్టార్.. వ‌చ్చీ రాగానే అనిల్ సినిమాతో బిజీ కానున్నాడు. దాంతో వ‌చ్చిన వెంట‌నే షూటింగ్ మొద‌లు పెట్టాలంటే ముందు ఇక్కడ అంతా సెట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి కెమెరా మెన్‌గా ర‌త్న‌వేలు అయితే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారు. అనిల్ రావిపూడి అండ్ టీం కూడా వెళ్లి ఆయ‌న్ని క‌లిసి క‌థ కూడా చెప్పార‌ని తెలుస్తుంది. దీనిపై ర‌త్న‌వేలు మాత్రం ఇంకా ఏం చెప్ప‌డం లేదు. చిరు సినిమా అయిన త‌ర్వాత మ‌హేశ్ సినిమా గురించి ఆలోచించ‌నున్నాడు ఈయ‌న‌. మ‌రి చూడాలిక‌.. చిరు కెమెరా మెన్ సూప‌ర్ స్టార్ సినిమాకు ప‌ని చేస్తాడో లేదో..?

More Related Stories