English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా ప్లాన్ చేస్తున్న సూప‌ర్ స్టార్ భార్య‌..

vijay
2019-06-03 20:48:49

విజ‌య్ దేవ‌ర‌కొండ డేట్స్ కోసం ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాత‌లే వేచి చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాకు బంగారు కొండ‌లా మారిపోయాడు ఈ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న సినిమా చేస్తే చాలు నిర్మాత‌ల‌కు కోట్ల‌కు కోట్లు లాభాలు వ‌స్తున్నాయి. అందుకే అత‌డి డేట్స్ కూడా బంగారంలా మారిపోయాయి. ఒక్క‌సారి క‌థ చెప్పి విజ‌య్‌ను ఒప్పిస్తే చాలు త‌మ కెరీర్ సెట్ అయిపోయిన‌ట్లే అని ఫీలైపోతున్నారు కుర్ర ద‌ర్శ‌కులు. ఇదిలా ఉంటే ఇప్పుడు నిర్మాత‌లు కూడా పోటీ ప‌డి మ‌రీ విజ‌య్ దేవ‌రొకండ‌తో ఒకేసారి రెండు మూడు సినిమాల‌కు క‌మిట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మ‌రో నిర్మాత కూడా విజ‌య్ డేట్స్ కోసం చూస్తుంది. ఆమె మ‌రెవ‌రో కాదు.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్. ఈమె కూడా త‌న సొంత నిర్మాణ సంస్థ మ‌హేశ్ బాబు ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. దీనికి ద‌ర్శ‌కుడు ఎవ‌రనేది ఇంకా తేల‌లేదు త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంద‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. విజ‌య్, న‌మ్ర‌త సినిమా ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories