English   

మురళీ మోహన్...వంకర మాటలు మాట్లాడితే ఇలానే వంకర పోతాయ్ : శ్రీ రెడ్డి

  sri reddy
2019-06-04 14:07:18

అనారోగ్యంతో బాధ పడుతూ మంచానికే పరమితం అయిన సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌ లు పరామర్శించారు. నిన్న హైదరాబాద్‌లోని మురళీ మోహన్ నివాసంలో కలిసి ఆయనతో కాసేపు సమయం గడిపారు. మరోపక్క మురళీ మోహన్‌ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పరామర్శించారు. నిన్న మురళీ మోహన్‌కు ఫోన్ చేసి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అయితే ఆయన మీద వివాదాస్పద నటి శ్రీ రెడ్డి విరుచుకుపడింది. 

అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మురళీ మోహన్‌ మీద ఆమె నోరు పారేసుకుంది. వంకర మాటలు మాట్లాడితే దేవుడు అన్ని వంచేస్తాడంటూ శాపనార్థాలు పెట్టింది. ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి ‘రియల్ ఎస్టేట్ భూమి కాదు కాపాడేది, మంచితనం ఒక్కటే జీవితం లో అన్ని కష్టాలనుంచి కాపాడతది..ఈ మధ్య వెన్నుముక వంగిపోయి ,కాళ్లు వంకర్లు పోయినోయ్ అంటగా మురళి మోహన్ గారు! ఇక నుంచైనా కష్టాల్లో వున్నవాళ్ళని చూసి వంకర వంకర మాటలు మాట్లాడకండి.. దేవుడు అన్ని వంచేస్తాడు..నన్ను తిట్టిన ప్రతి ఒక్కరు ఏదొక రూపంలో అనుభవిస్తున్నారు పాపం.. దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు కర్మ తిరిగి అప్ప చెప్పటానికి !ఏది ఏమైనా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా ’ అంటూ పోస్ట్ చేసింది. 

అయితే ఆమె చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ సమయంలో ఆయన సరిగా స్పందించక పోవడంతో ఆయనను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి.  తన తల్లి అస్థికలు గంగలో కలిపేందుకు వారణాసి వెళ్లిన మురళీమోహన్ అక్కడ కుప్పకూలి పోయారు. ఆయన హైదరాబాద్‌ లోని కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆయన వెన్నెముకలో సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్‌ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

More Related Stories