English   

జేడీతో సినిమా చేయనున్న వర్మ 

RGV
2019-06-04 14:28:18

న‌టుడిగా జేడీ చ‌క్ర‌వ‌ర్తి గుర్తింపు తెచ్చుకున్నాడంటే కార‌ణం వ‌ర్మ‌ అని చెప్పక తప్పదు. శివ‌తో జేడీతో పాటు చాలామందికి యాక్టింగ్ లైఫ్ ఇచ్చిన వ‌ర్మ‌. మిగతావారిలా కాకుండా జేడీని వ‌ద‌ల్లేదు. బాలీవుడ్‌కీ తీసుకెళ్ళి అక్కడ కూడా స‌త్య‌లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చాడు. అంతేనా నటుడిని ద‌ర్శ‌కుడిగా కూడా మార్చాడు. అయితే ఏమయిందో ఏమో కానీ కొన్నాళ్లుగా వీరు దూరం దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. జేడీ లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాని వర్మ దర్శకత్వం వచించడు కానీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. తన టీంలో ఉన్న ఒక చాకు లాంటి అసిస్టంట్ ని ద‌ర్శ‌కుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా ఉంటుందట. ఆ విషయాన్ని వర్మ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారట. అప్పట్లో వర్మ థైస్ అండ్ గ‌న్స్‌ అనే వెబ్ సిరీస్‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ప్ర‌స్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వాట‌న్నింటినీ జేడీనే ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. ఇక  ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కీలకమైన పాత్రలను చేస్తూ జేడీ బిజీగా వున్నాడు. అయితే మాకు మా గురువు రాంగోపాల్ వర్మ డబ్బులు సంపాదించడం తప్ప అన్నీ నేర్పారు అంటున్నారు జేడీ. తనకు డబ్బు మీద వ్యామోహం లేదని, డబ్బు కోసం సినిమాలు చేయనని, నాకు వ్యక్తిగతంగా ఉత్సాహం కలిగించే సినిమాలనే చేస్తానని చెప్పుకొచ్చాడు. అలా ఆయన కీలక పాత్ర పోషించిన 'హిప్పీ' ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికేయ కథానాయకుడిగా, దిగంగన సుర్యవంశీ, జబ్బ సింగ్ కథానాయకులుగా నటించిన హిప్పీ సినిమాకు టి.ఎన్ కృష్ణ దర్శకునిగా వ్యవహరించారు.

More Related Stories