English   

ఆ హీరోయిన్ కి భయపడి వెనక్కి వెళ్ళిన హృతిక్ రోషన్

Hrithik Roshan
2019-06-04 14:50:12

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్ జీవిత నేప‌థ్యంలో సూప‌ర్ 30 అనే ఒక బయోపిక్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా వేసింది చిత్ర బృందం. కాగా ఈ సినిమాను జూలై 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిజానికి ముందుగా ఈ సినిమాని జూలై 26న విడుద‌ల చేయాల‌ని హృతిక్ భావించాడు. అయితే అదే రోజు కంగ‌నా న‌టించిన మెంట‌ల్ హై క్యా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుద‌ల కానుండ‌డం అది కూడా ఒకరంటే ఒకరికి పాడనీ ఈ ఇద్దరి స్టార్స్ సినిమాలు రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆసక్తిక‌ర పోటీ జ‌ర‌గ‌నుంద‌ని విశ్లేష‌కులు భావించారు. అయితే కంగానా సోద‌రి రంగోలి కావాల‌నే త‌న అక్క‌కి పోటీగా హృతిక్ త‌న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాడంటూ త్వీత్స్ చేసింది. ఈ ట్వీట్స్ దెబ్బకి భయపడిన హృతిక్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ డేట్ మారుస్తామ‌ని ఆమెకి స్పష్టం చేశారు. అన్నట్టుగానే ఈ సినిమాని మళ్ళీ వెనక్కి జరిపారు. ఎన్నో రకాల సమ‌స్య‌లు మా సినిమాని వెంటాడినా అన్నింటిని సానుకూలంగా దాటుకుని జూలై 12న మా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. వెండితెర‌పై హృతిక్‌ తొలిసారిగా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో సినిమా మీద అయితే అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు కూడా మంచి రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక స్టార్ హీరో ఒక హీరోయిన్ కి భయపడి వెనక్కి వెళ్ళాడంటూ బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

More Related Stories