English   

హమ్మయ్య....అనుకున్న టైంకే వస్తున్నాడు 

 Salman Khan
2019-06-04 15:30:46

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా మూవీ భారత్ భారీ అంచనాల నడుమ జూన్ 5న విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే భారత్ అనేది మన దేశం పేరని, అలా ఒక దేశం పేరుని ఇలా కమర్షియల్ సినిమాలకి టైటిల్ గా వాడకూడదని వికాస్ త్యాగి అనే వ్యక్తి ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జూన్ 5న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో సత్వరమే విచారణ జరిపి సినిమా రిలీజ్ కు స్టే విధించాలని కోరాడు. దేశం పేరుతో రూపొందిన ఈ సినిమా దేశ సాంస్కృతిక, రాజకీయ ప్రతిష్టను మసకబార్చేలా ఉందని చేసిన పిటిషనర్‌ ఆరోపణలపై విచారణకు హైకోర్టు ముందుకొచ్చింది. ఇక ఈ పిటిషన్ విచారణ నిన్న ఢిల్లీ హై కోర్టు స్పెషల్ బెంచ్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్ బెంచ్ వికాస్ త్యాగి వాదనని కొట్టిపారేసి భారత్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఈ పిటిషనర్ ను న్యాయస్థానం ఈ సినిమాలో అభ్యంతరకరమైన అంశాలు ఏమున్నాయో చెప్పాలని కోరగా సదరు పిటిషనర్ సినిమా చూడలేదని, కానీ ట్రైలర్లో అలాంటివి ఉన్నాయని అన్నారు. ఇక దాంతో ట్రైలర్ చూసిన ధర్మాసనం ఇందులో అభ్యంతరకరమైన అంశాలు ఏమున్నాయి, పేరు కోసమే పిటిషన్ వేశారని తేలితే మీకు 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో భారత్ మూవీ దుగా అనుకున్నట్లుగానే జూన్ 5న  విడుదల కానుంది. ఈ సినిమా మీద కోర్టు స్టే విధిస్తుందేమోనని మేకర్స్ సహా, సల్మాన్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ కోర్టు మాత్రం వీరికి తీపి కబురు చెప్పింది.
 

More Related Stories