English   

ఆర్ఆర్ఆర్ సీక్రెట్ షూటింగ్...అందుకే ?

RRR
2019-06-04 16:26:33

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ ఒక షెడ్యూల్ గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంది. అక్కడ చరణ్‌కు గాయం కావడంతో 3 వారాల పాటు షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వత ఎన్టీఆర్ కూడా గాయపడటంతో ఆర్ఆర్ఆర్' షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. అలాగే, సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎవరో కొన్ని ఫోటోలు తీసి నెట్ లో లీక్ చేశారు. ఈ పరిణామాలతో ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతోన్నా ఎక్కడా దీనికి సంబందించిన అప్డేట్ లేకుండా చూసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి  ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.  కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ బ్రిటీష్ సైన్యంతో తలపడే  సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించారని అంటున్నారు. బాహుబలి లానే ఈ సినిమా మీద కూడా స్పెషల్ ఇంటరెస్ట్ పెడుతున్న జక్కన్న సెట్ మీదకి మొబైల్ ఫోన్స్‌సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించడం లేదట. ఈ సినిమాలో ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. జూలై 30 2020వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.  
 

More Related Stories