English   

గ్యాప్ తో వచ్చినా భలే వర్కౌట్ చేస్తోందే ?

Shruti Haasan
2019-06-04 17:47:56

క‌మ‌ల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాస‌న్ తండ్రి బ్రాండ్ వేసుకునే ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సెట్ చేసుకుంది. దాదాపు తెలుగులో అగ్రహీరోలు అందరితోనూ నటించిన ఈ భామ ఆ తర్వాతి కాలంలో సైలెంట్ అయ్యింది. ఇదే సమయంలో విదేశీయుడు అయిన మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయ‌ణం కూడా నడపడంతో వీరిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోనున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్టు వీరి ప్రేమ‌కి బ్రేక్ ప‌డింది. 

ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రియుడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు మేమిద్ద‌రం ఒంటరి మార్గాల‌లో న‌డ‌వాల్సి వ‌స్తుందని, కాని ఆమె ఎప్ప‌టికీ నా బెస్ట్ ఫ్రెండేనని, ఆమె ఫ్రెండ్‌గా దొర‌కడం తన అదృష్టం అనీ ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్ప‌గా ఫీల‌వుతున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. అలా ప్రేమ మత్తులో మునిగి రెండేళ్ళు సినిమాలు చేయకుండా కాలం వృధా చేసుకున్న ఈ భామ గతేడాది వరుస్ హిట్స్ తో ఫాంలో ఉన్న విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించేందుకు ఛాన్స్ దక్కించుకుంది. ఎస్‌పీ జ‌న‌నథ‌న్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లాభం అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో దేశంలోని రైతు సమస్యల మీద మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు. 

ఇక తెలుగులోను ఆమె తన పాత పరిచయాల ద్వారా కొర‌టాల శివ‌- చిరంజీవి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాలో ఛాన్స్ సంపాదించిందని అంటున్నారు. శ్రీమంతుడులో కొరటాల శివతో కలిసి పనిచేసిన ఆమె ఆ పరిచయంతో వర్కౌట్ చేయగా ఆయన మాట ఇచ్చాడట. అంతేకాక గోపిచంద్ మలినేని,రవి తేజ కాంబినేషన్ లో రానున్న ఓ మూవీ లో కూడా శృతి నటించే అవకాశాలున్నాయి అంటున్నారు. మొత్తానికి బ్రేకప్ శృతి హాస‌న్ మరచిపోవడానికి ఒప్పుక్కుంటుందో లేక ఖాళీగా ఉండలేక ఒప్పుకుంటుందో కానీ మొత్తానికి బిజీ అయిందన్నమాట.  

More Related Stories