English   

స‌ప్త‌గిరి.. ఇప్పుడు ఇవ‌న్నీ అవ‌స‌రం అంటావా..? 

Vajra Kavachadhara Govinda
2019-06-04 17:59:04

స‌ప్త‌గిరి హీరో అవుతున్నాడంటే వావ్ అనుకున్న వాళ్ల‌కంటే.. ఆ ఏముందిలో గుంపులో గోవిందా అనుకున్న వాళ్లే ఎక్కువ‌. అస‌లు మ‌నోడు హీరో మెటీరియ‌లే కాద‌ని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా హీరోగా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు ఈ కుర్ర క‌మెడియ‌న్. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్లైనా ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌లో ఉన్న కామెడి కోణాన్ని త‌ప్ప మ‌రేదీ బ‌య‌ట‌పెట్ట‌లేదు స‌ప్త‌గిరి. హీరోగా ఛాన్స్ వ‌చ్చేస‌రికి ఆపుకోలేక అన్నీ ఒకేసారి బ‌య‌టికి తీసుకొచ్చాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్, స‌ప్త‌గిరి ఎల్ఎల్బి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు ఈ క‌మెడియ‌న్. ప్ర‌తీ సినిమాలోనూ డాన్సులు, ఫైట్లలో కుమ్మేస్తున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇప్పుడు కూడా వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద సినిమాతో వ‌స్తున్నాడు. ఈ ట్రైల‌ర్ విడుద‌లైందిప్పుడు. ఇది చూసిన త‌ర్వాత మ‌రోసారి కామెడీతో పాటు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు. గుళ్లో ఉండే నిధి కోసం సాగే వేట‌లా ఈ చిత్ర క‌థ ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో కమెడియ‌న్లు హీరోలుగా నిల‌బ‌డిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదు.. మ‌రిప్పుడు స‌ప్త‌గిరి ఏం చేస్తాడో చూడాలిక‌.

More Related Stories