English   

మ‌హేశ్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు క‌థ ఆ రెండు సినిమాల‌కు మిక్సీ..

mahesh
2019-06-04 20:07:23

ఈ రోజుల్లో ఏ సినిమా తీసుకున్నా కూడా క‌థ ఎక్క‌డో ఓ చోట చూసిన‌ట్లే ఉంటుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి ద‌ర్శ‌కుడు అయితే కొత్త క‌థ‌ల‌ను అస్స‌లు తీసుకోడు. ఉన్న క‌థ‌ల‌నే స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి.. దానికే వినోదాన్ని జోడిస్తాడు. కామెడీతో క‌డుపులు చెక్క‌లు చేసి సూప‌ర్ హిట్స్ అందుకుంటున్నాడు ఈయ‌న‌. ఇప్పుడు మ‌హేశ్ బాబు హీరోగా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో వ‌స్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్ర క‌థ ఇదే అంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కొన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇది చూసి సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నా.. క‌థ బాగుంద‌ని ఆనందంగానూ ఉన్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే ఇందులో మ‌హేశ్ బాబు ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని ద‌ర్శ‌కుడే క్లారిటీ ఇచ్చాడు.
అయితే త‌న ఫ్రెండు కోసం ఆర్మీ నుంచి వెన‌క్కి వ‌చ్చేస్తాడ‌ని.. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత అస‌లు సంఘ‌ట‌న‌లు మొద‌ల‌వుతాయ‌ని తెలుస్తుంది. ఇక విజ‌యశాంతి కూడా హీరో ఫ్రెండ్ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌కు కూడా ఇందులో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర దొరికింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆగ‌డు మాదిరే ఆమె ఫ్యామిలీ ఇందులో మ‌హేశ్ బాబు టార్చ‌ర్ చేస్తుంటార‌ని.. అది చాలా స‌ర‌దాగా ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే అదెందుకు అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే స‌రిలేరు నీకెవ్వ‌రు క‌థ అత‌డు, వార‌సుడొచ్చాడు సినిమాల‌కు మిక్సీలో వేసిన‌ట్లుగా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ రెండు సినిమాల‌ను క‌లిపి మ‌రో మంచి క‌థ‌ను అనిల్ ఎలా బ‌య‌టికి తీసుకొస్తాడో..? స‌ంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది.

More Related Stories