English   

టైగర్ నాగేశ్వర్ రావుకి ముహూర్తం ఖరారు

tiger
2019-06-04 20:20:40

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ వారసుడిగా నట జీవితానికి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. వరుసగా అరా డజను సినిమాలు చేసినా మనోడికి కాలం కలిసిరాకపోవదంతో ఏదో నెట్టుకు వస్తున్నాడు. ఇక ఈ మధ్యనే డైరెక్టర్ తేజ తెరకెక్కించిన సీత సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అక్కడ కూడా దెబ్బ పడడంతో యధా విధిగా తర్వాతి సినిమా మీద ద్రుష్టి పెట్టాడు. అయన తాజా సినిమాగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తమిళ్ రాచ్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమా తెరక్కుతోంది. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాతో మరో మారు పోలీస్ ఆఫీసర్ గా తన లక్కు పరీక్షించుకోబోతున్నాడు బెల్లంకొండ. ఇక ఈ సినిమా తర్వాత ఆయన దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒకప్పటి స్టూవర్ట్పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా బ‌యోపిక్ రూపొంద‌నుండ‌గా ఇందులో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు పాత్రని బెల్లంకొండ చేయ‌బోతున్న‌ట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా షూటింగ్  ఆగ‌స్ట్ నుండి మొద‌లు కానున్న‌ట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన పాయ‌ల్ రాజ్‌పుత్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More Related Stories