English   

విజయ్ దేవరకొండ సినిమాలో పడుకుంటేనే అవకాశం.. తమిళ నటి సంచలనం..

vijay
2019-06-04 21:08:51

ఇండస్ట్రీలో ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించి పెద్దగా ఉదంతాలు వినిపించడం లేదు.. కనిపించడం లేదు. కానీ చాలా రోజుల తర్వాత ఒక తమిళనటి విజయ్ దేవరకొండ సినిమాపై సంచలన ఆరోపణలు చేసింది. త్వరలోనే విజయ్ దేవరకొండతో సినిమా తెరకెక్కించబోయే ఒక ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. ఆ సినిమాలో అవకాశం రావాలంటే తనతో పడక సుఖం పంచుకోవాలని అడిగాడని.. దాంతో తాను సినిమా వదిలేసుకున్నానని చెప్పింది ప్రముఖ తమిళ నటి శాలు శాము. అయితే ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం ఈ ముద్దుగుమ్మ నిరాకరించింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేస్తూ ఈ విషయాన్ని బయట పెట్టింది శాలు. మీకు ఎప్పుడైనా మీ టూ బాధలు ఎదుర్కొన్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తమిళ ఇండస్ట్రీలో ఎప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కోలేదని.. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక ప్రముఖ దర్శకుడు తనను పడక గదికి రావాలంటూ సంచలన ఆరోపణలు చేసింది ఈ తమిళ నటి.

ఈ మధ్యే విడుదలైన శివకార్తికేయన్ మిస్టర్ లోకల్ సినిమాలో నటించింది శాలు. తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. విజయ్ దేవరకొండ సినిమాపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఇన్ని ఆరోపణలు చేసిన ఈ భామ ఆ దర్శకుడు పేరు చెప్పడానికి మాత్రం నో అంటుంది. ఒకవేళ ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా కూడా తప్పు చేసినట్లు ఆ దర్శకుడు ఒప్పుకోడు.. అంత దానికి తను పేరు చెప్పడం ఎందుకు అంటోంది ఈ ముద్దుగుమ్మ. చిన్మయి లాంటి వాళ్లు కూడా ఈ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారని.. వాళ్లకే న్యాయం జరగలేదు ఇక తనకేం న్యాయం జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతిమాధవ్, ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో నటిస్తున్నాడు. మరి ఆ తమిళ నటిని పడక గదికి రమ్మని ఆహ్వానించిన ఆ దర్శక దిగ్గజం ఎవరో..

More Related Stories