English   

నైజాంలో దుమ్ము రేపుతున్న ఫలక్ నుమా దాస్...తరుణ్ భాస్కర్ సలహా

movie
2019-06-04 21:32:46

గత నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫలక్ నుమా దాస్‌ సినిమా వసూళ్ల పరంగా నైజామ్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ఏరియాని హైలైట్ చేస్తూ తీసిన ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ పెద్దగా మక్కువ చూపక పోగా మాస్ ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి మరీ ముఖ్యంగా నైజామ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. నైజామ్ లో 4 రోజులకు ఈ సినిమా 1.89 కోట్ల షేర్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఫుల్ రన్ లో అయితే నైజాం ఏరియాలో రూ. 3 కోట్ల షేర్ వరకూ వెళ్లే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. అయితే కలెక్షన్స్ విషయం పక్కనపెడితే ఈ సినిమా మీద నెగటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో జరిగిన కొన్ని ఘటనలు వాటి మీద విష్వక్ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించాడు. విష్వక్సేన్ గురించి తనకు తెలుసనీ, చాలా మంచివాడని, అప్పుడప్పుడు కొంచెం తొందరపడి మాట్లాడుతూ ఉంటాడని, అది సరిదిద్దుకోవాలని తాను విష్వక్ కి చెబుతున్నానని ఒక వీడియో రిలీజ్ చేశాడు. సెలెబ్రిటీ అయ్యాక ఒకటి మాట్లాడితే అది పది రకాలుగా బయటికి వెళుతూ ఉంటుందని, నా విషయంలో కూడా అదే జరిగిందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుందని కానీ ఆ సమయంలోనే సహనంతో ఉంటె సమస్య తీరిపోతుందని చెప్పుకొచ్చాడు.

More Related Stories