English   

అనుమ‌తి లేకుండా ఇళ‌య‌రాజా పాట పాడితే అంతే సంగ‌తులు..

raja
2019-06-04 21:51:16

ఇళ‌య‌రాజా.. ఈయ‌న పాట‌లు విన‌డానికి చాలా తీయ‌గా ఉంటాయి. సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు క‌దా.. అలా ఉంటాయి రాజా గారి పాట‌లు. ఆయ‌న పాడ‌టం మొద‌లుపెడితే అంతా ఫిదా అయిపోవాల్సిందే. అయితే మ్యాస్ట్రో పాట‌లు ఎంత తీయ‌గా ఉంటాయో.. మాట‌లు అంత క‌ఠినంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయ‌న పాట‌ల విష‌యంలో మాత్రం ఎప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటాడు రాజా. త‌న పాట‌లు వాడుకుంటున్న‌పుడు త‌న‌కు రావాల్సిన మొత్తం రావాల్సిందే.. లేదంటే తాట తీస్తానంటాడు. ఈ విష‌యంలో త‌న ప్రాణ స్నేహితుడు ఎస్పీ బాలును సైతం వ‌ద‌ల్లేదంటే ఇళ‌య‌రాజా తీరేంటో అర్థం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా త‌న పాట‌ల‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ‌.. త‌న అనుమ‌తి లేకుండా పాడితే ఇప్ప‌ట్నుంచీ చుక్క‌లు త‌ప్ప‌వంటున్నాడు ఈయ‌న‌. ఈ విష‌యంపైనే కోర్టుకు కూడా వెళ్లాడు ఇళ‌య‌రాజా. మ‌ద్రాస్ హై కోర్ట్ కూడా ఇప్పుడు మ్యాస్ట్రోకు స‌పోర్ట్ చేస్తూ తీర్పు ఇచ్చింది.

రాజా గారి పాట‌లు వాడుకోవాలంటే ముందు ఆయ‌న అనుమ‌తి ఉండాల్సిందే.. అలా కాకుండా క‌మ‌ర్షియ‌ల్ కోణంలో పాట‌లు వాడుకుంటే త‌ప్ప‌కుండా ఫైన్ క‌ట్టాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది కోర్ట్. ఇళ‌య‌రాజాకు రావాల్సిన రాయ‌ల్టీ ఇచ్చిన త‌ర్వాతే ఆయ‌న పాట‌లు వాడుకోవాల‌ని సెన్సేష‌న‌ల్ తీర్పు ఇచ్చింది మ‌ద్రాస్ కోర్ట్. ఈ తీర్పుపై మ్యాస్ట్రో కూడా సంతోషంగా ఉన్నాడు. త‌న‌కు న్యాయం జ‌రిగింద‌ని చెబుతున్నాడు ఈ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. మ‌రి ఇప్ప‌ట్నుంచి ఇళ‌య‌రాజా పాట‌లు వాడుకోవాలంటే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మ‌రింత తిప్ప‌లు త‌ప్ప‌వేమో..?

More Related Stories