English   

విశ్వ‌క్ సేన్ ఆటిట్యూడ్ త‌గ్గించుకుంటేనే ఇండ‌స్ట్రీలో నాలుగు నూక‌లు..

hero
2019-06-04 22:07:08

ఇప్పుడు ఒక్క‌రు కాదు.. అంతా అంటున్న మాట ఇదే. లేక‌పోతే మ‌రేంటి.. ఒక్క సినిమా కూడా హిట్ కాక‌ముందే మ‌నోడి మాట‌తీరు తేడాగా ఉంది. ఒక్క‌టి కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చిందంటే క‌నీసం కంటికి కూడా ఎవ‌రూ క‌నిపించ‌రేమో మ‌రి..? ఎందుకంటే ఇప్పుడు విశ్వ‌క్ సేన్ ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు అంద‌రికీ షాక్ ఇస్తుంది. ఫ‌లక్‌నుమా దాస్ సినిమా విష‌యంలో విశ్వ‌క్ చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. ఈ చిత్ర జ‌యాప‌జ‌యాల విష‌యం ప‌క్క‌న‌బెడితే మ‌నోడు చూపిస్తున్న ఆటిట్యూడ్.. మాట్లాడుతున్న మాట‌లు కొంద‌రికి న‌చ్చుతున్నా కూడా చాలా మందికి మాత్రం ఇది సెటైర్లుగా అనిపిస్తున్నాయి. ఇంత ఆటిట్యూడ్ ఉంటే ఇండ‌స్ట్రీలో ఉండ‌టం క‌ష్ట‌మే అని త‌రుణ్ భాస్క‌ర్ లాంటి వాళ్లు కూడా ఈ కుర్ర హీరోకు సల‌హాలు ఇస్తున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మాట్లాడే తీరు తెలియ‌న‌పుడు క‌చ్చితంగా పాతాళానికి వెళ్ల‌డం ఖాయం. మీడియా ఇంట‌ర్వ్యూల‌లో కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతూ అక్క‌డ కూడా కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తున్నాడు విశ్వ‌క్ సేన్. యాంక‌ర్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాధానం చెప్ప‌కుండా త‌న‌కు న‌చ్చింది చేస్తూ పోతున్నాడు ఈ హీరో. ఇదే గానీ కంటిన్యూ అయితే మ‌నోడి కెరీర్ ఆరంభంలోనే పాతాళానికి చేర‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి చూడాలిక‌.. క‌నీసం ఇప్ప‌ట్నుంచైనా విశ్వ‌క్ త‌న తీరు మార్చుకుంటాడో లేదో..?

More Related Stories