English   

మహేష్ - సందీప్ సినిమా మీద క్లారిటీ ?

mb
2019-06-04 22:34:03

టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ ఈ మధ్య మ‌హ‌ర్షి సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. ఇక ప్ర‌స్తుతం స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తు విదేశాలలో ఫ్యామిలీతో ఉన్న మ‌హేష్ త్వ‌ర‌లో అనీల్ రావిపూడి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూట్ లో పాల్గోననున్నాడు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. అనిల్‌ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఇక మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత చేయబోయే సినిమాపై కూడా చర్చ మొదలైంది. చాలా కాలంగా అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి బాలీవుడ్ రీమేక్‌ కబీర్‌ సింగ్‌ పనుల్లో బిజీగా ఉన్న సందీప్‌, ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించానని తాను చెప్పిన లైన్‌ మహేష్‌కు నచ్చటంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నారని, బౌండెడ్ స్క్రిప్ట్ ఇస్తే పని మొదలు పెడదమని అన్నారని తాను అదేపనిలో ఉన్నానని ఆయన అంటున్నాడు. అయితే మ‌హేష్ కోసం ఇప్పటికే రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొర‌టాల శివ‌, సందీప్ వంగా, పరుశురామ్ వంటి దర్శకులు లైన్‌లో ఉన్నారని తెలుస్తోండ‌గా, ఏ ద‌ర్శ‌కుడితో ముందుగా ప్రాజెక్ట్ చేస్తాడ‌నే దానిపై అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇక సందీప్ డైరెక్షన్ లో షాహిద్ కపూర్‌, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన కబీర్‌ సింగ్‌ జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories