English   

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూల్ మొదలు

 allu arjun
2019-06-05 09:47:10

నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ అల్లు అర్జున్ మ‌రో సినిమా చేయ‌లేదు. ఈ మధ్యనే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమాకు సైన్ చేసి చాలా రోజులైనా కూడా ఈ సినిమా షూటింగ్ ప‌రిస్థితి ఏమీ అర్ధం కావడం లేదు. నిజానికి ఒక షెడ్యూల్ పూర్తి అయిందని వార్తలు వస్తున్నా రెండో షెడ్యూల్ ఎప్పటి నుండి మొదలవుతుందని అందరూ ఉత్సుకతగా ఉన్నారు. ఎండల దెబ్బకి బ్రేక్ ఇచ్చిన మండిపోతుండటంతో బ్రేక్ ఇచ్చారు. ఇక ఎండలు తగ్గుముఖం పట్టడంతో ఈరోజు నుండి రెండో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారని సమాచారం. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు నుంచి 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగును జరపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నాయికగా పూజా హెగ్డేను తీసుకున్న సంగతి తెలిసిందే. రెండవ హీరోయిన్ గా కేతికా శర్మను ఎంపిక కూడా చేసుకున్నారు. ఇక టబుతో పాటు ప్రధాన పాత్రధారులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత మ‌రోసారి నాన్న సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు త్రివిక్ర‌మ్. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

More Related Stories