English   

మారుతి తేజూ సినిమాకి సంక్రాంతి స్పెషల్ టైటిల్ 

Sai Dharam Tej
2019-06-05 10:49:06

ఆరు భారీ డిజాస్టర్ ల త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి సినిమాతో మంచి హిట్ కొట్టాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ఈ ఇచ్చిన సక్సెస్ తేజూకి మంచి బ‌లాన్ని ఇచ్చింది. త్వ‌రలో మారుతితో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. మారుతి- తేజు కాంబినేష‌న్‌లో రానున్న సినిమా మీద ఈ ఇద్దరూ ఆశలు పెట్టుకున్నారు. నిజానికి గత ఏడాది శైలజా రెడ్డి అల్లుడు సినిమా తెరకెక్కించిన మారుతి ఆ సినిమా ఫెయిల్ కావడంతో  చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ధరమ్ తేజ సినిమా ఎమోషనల్ టచ్ తో సాగుతుంద‌ట‌. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమాని మారుతి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక తేజు తండ్రి పాత్ర‌లో రావు ర‌మేష్ న‌టిస్తార‌ని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి భోగి అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తాజా స‌మాచారం. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మను కథానాయకిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. 2020 సంక్రాంతి సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తారు కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని వీలయినంత త్వరలో సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. ఇక ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories