English   

జేడీ సార్....మరీ గుడ్డలిప్పి ప్రమోషన్స్ చేయాలా ?

JD Chakravarthy
2019-06-05 10:58:04

ఒకప్పుడు సినిమా ప్రచారం అంటే పోస్టర్ లు వేసే వారు, ఆ పరపంర నుండి ఇంటర్వ్యూ రేంజ్ కి వెళ్లాం. ఇక ఆర్జీవీ లాంటి వాళ్ళు అయితే వివాదాలతో ప్రమోషన్ చేసుకుంటారు. మా గురువు అల చేస్తే నేనెందుకు మామూలుగా చేయాలి అనుకున్నాడో ఏమో కానీ జేడీ చక్రవర్తి, ఇప్పుడు చేసిన పని అందరి చేతా ఆయన్ని తిట్టిస్తోంది. ఆరెక్స్ 100 ఫేమ్ కార్తీకేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన హిప్పీ మూవీ రేపు రిలీజ్ కానుంది ఈ సినిమాకి టీఎన్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటించారు. రేపే రిలీజ్ కావడంతి ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.  ప్రమోషన్స్ అంటే అలాంటి ఇలాంటి ప్రమోషన్స్ కాదు అదో రకం అన్నట్టు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రమోషన్ వీడియోను విడుదల చేశారు. ఓ కాఫీ షాప్‌లో యాంకర్ హేమంత్‌తో ఇంటర్వ్యూ ముగించుకుని బయటకు వస్తున్న కార్తీకేయ, జేడీ చక్రవర్తిలను ‘సర్.. సర్.. సర్ ఒక్క ప్రశ్న అడగడం మరిచిపోయా.. ఇంతకీ హిప్పీ అంటే ఏంటి సార్, మాటల్లో వద్దు చేతల్లో చేసి చూపించండి అని హేమంత్ కోరడంతో.. ఒకరి ముఖం ఒకరు చూసుకుని కార్తీకేయ ఒంటిపైన ఉన్న షర్ట్‌ని తీసేసి దిస్ ఈజ్ హిప్పీ అంటాడు. ఇక పక్కనే ఉన్న జేడీ చక్రవర్తిని మరి మీరు అనగానే.. ‘ఫ్యాంట్ విప్పేసి అండర్ వేర్‌తో దిస్ ఈజ్ హిప్పీ అని షాక్ ఇచ్చారు. నిజానికి అది ఒక పబ్లిక్ ప్లేస్ అక్కడ కాఫీ  తాగుతున్న అమ్మాయి బిత్తరపోవడం కూడా వీడియోలో కనిపించింది. హిప్పీ కాస్త విభిన్నమైన సినిమా అయితే అయ్యుండచ్చు కానీ అంత మాత్రానికే ఇలా గుడ్డలు విప్పుకుని తిరగాలా అని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.  

More Related Stories