English   

టిటిడి చైర్మన్ గా మోహన్ బాబు....క్లారిటీ ?

mohan babu
2019-06-05 11:41:43

టిటిడి చైర్మన్ గా ప్రముఖ నటుడు, వైసిపి నేత మంచు మోహన్ బాబును నియమించే అవకాశం కనిపిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయం మీద మోహన్ బాబు ఈరోజు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసిపి చీఫ్ జగన్ ను ఎపి సిఎంగా చూడాలన్నదే తన కోరిక అని అందుకే వైసీపీ విజయం కోసం తన వంతు ప్రయత్నం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి నామినేటెడ్ పదవులు ఆశించడం లేదని, జగన్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను టిటిడి చైర్మన్ గా నియమిస్తున్నారన్న వార్తలపై ఆయన ట్వీట్ చేస్తూ పైవిధంగా స్పందించారు. అలాగే ఆయన మీడియాకు నా విన్నపం అంటూ ఈ పుకార్లను ప్రోత్సహించకండని కోరారు. జగన్‌పై నమ్మకంతోనే పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చానని తెలిపిన మోహన్ బాబు ఎలాంటి పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు. అయితే ఒకప్పుడు టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు ఆ తర్వాత కాలంలో పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే వైఎస్ ఉన్నప్పుడే తన పెద్ద కొడుకుని వైఎస్ తమ్ముడి కూతురు వేరోనికాకి ఇచ్చి వివాహం చేయడంతో ఆయన అప్పుడే రాజకీయ ఎంట్రీ మళ్ళీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయినా చానాళ్ళ పాటు సైలెంట్ గా ఉన్న ఆయన ఈమధ్య సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

More Related Stories