English   

జయసుధకు కీలక పదవి ఆఫర్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..

jayasudha
2019-06-05 12:03:54

ఎవరు అవునన్నా కాదన్నా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపులో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. ఇదివరకు ఎన్నడూ లేనంతగా వైయస్ జగన్ కు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ గా నిలిచింది. ఒకరూ ఇద్దరూ కాదు దాదాపు 10 మంది సెలెబ్రిటీలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. ఆయన కోసం ప్రచారం కూడా చేశారు. సీనియర్ నటి జయసుధ కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రాష్ట్రం విడిపోయిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సేవలు అందించిన జయసుధ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కి దూరంగా జరిగారు. దానికి తోడు భర్త చనిపోయిన తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. అయితే ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరడం ఆశ్చర్యాన్ని కలిగించింది. జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని ఆమె సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు తాను గెలవడంతో ప్రతిఫలంగా ఒక కీలకమైన పదవి ఇవ్వాలని చూస్తున్నాడు నూతన ముఖ్యమంత్రి. ఏపిడిఎఫ్సి చైర్మన్ గా జయసుధను కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా సహజనటిని అపాయింట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధమవుతున్నాడు వైయస్ జగన్. ఇక ఈ పదవి కోసం మోహన్ బాబు, కమెడియన్ అలీ కూడా ఎదురు చూస్తున్నారని.. వాళ్లను కాదని ఈ పదవిని జయసుధకు కట్టబెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ముందు తెలుగుదేశం హయాంలో అంబికా కృష్ణ ఈ పదవిలో ఉన్నారు. జగన్ తెలిసిన తర్వాత ఆయన రాజీనామా చేసి తప్పుకోవడంతో ఆ పదవి జయసుధకు ఇవ్వడానికి జగన్ సన్నాహాలు చేస్తున్నాడు. తన గెలుపు ఎంతో కొంత పాత్ర పోషించిన ఈమెకు ఇలా పదవి ఇవ్వడానికి చూస్తున్నాడు జగన్. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జయసుధతో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే గెలిచిన వెంటనే జయసుధకు కీలక పదవి కట్టబెట్టడానికి జగన్ పావులు కదుపుతున్నాడు.

More Related Stories