English   

వైఎస్ జగన్ అగ్ర దర్శకుడికి చుక్కలు చూపించబోతున్నారా..

 YS Jagan
2019-06-05 13:04:09

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆయనకు అనుకూలంగా ఉన్న వారిపై జగన్ వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరిని వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందులో ముఖ్యంగా టీటీడీ మాజీ ఛైర్మన్ కె రాఘవేంద్రరావుపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఆయన టిటిడి పదవిలో ఉన్నప్పుడు భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ ఎంక్వయిరీ కూడా తేల్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడితో ఆగకుండా టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం కూడా ఓ సంచలనమే. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగా ఉన్నాడు రాఘవేంద్రరావు. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉచితంగా ప్రకటనలు చేసి పెట్టడం.. పార్టీకి ప్రచారం చేయడంతో చంద్రబాబు కూడా ఎప్పుడు దర్శకేంద్రుడు విషయంలో కఠినంగా వ్యవహరించ లేదు. ఇప్పుడు తెలుగుదేశం దారుణంగా ఓడిపోవడం.. ఉన్నట్టుండి రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. విజిలెన్స్ అధికారులతో మాట్లాడి ఈ కేసును తిరగదోడేందుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రణాళికలు రచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇదే గాని జరిగితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు చుక్కలు కనపడటం ఖాయం. ఎందుకంటే ఆయన హయాంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందని నిరూపితమైంది కూడా. ఇలాంటి సమయంలో జగన్ గాని రాఘవేంద్రరావుపై ఫోకస్ చేసాడంటే లేనిపోని తలనొప్పులు తప్పవు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిప్పుడు కె.రాఘవేంద్రరావును జగన్ లైట్ తీసుకుంటాడా లేదంటే కేసులో ఇరికిస్తాడా అనేది చూడాలి.

More Related Stories