English   

ఇటలీ వెళ్తున్న మహేష్...రంజాన్ శుభాకాంక్షలు 

 mahesh babu
2019-06-05 17:02:02

మహర్షి సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి విదేశీ టూర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం జర్మనీలో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ త్వరలో ఇటలీ బయలుదేరుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. అంతే కాక ఈరోజు రంజాన్ సందర్భాంగా ముస్లిమ్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఓ హోటల్లో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఈ రంజాన్ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనందం, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇక ఆయన వెకేషన్ పూర్తయ్యాక అనిల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా ఓపెనింగ్ కూడా జ‌రిగింది. ప్ర‌స్తుతం క‌థ విష‌యంలో  ఫైనల్ టచింగ్స్ ఇస్తున్నాడు అనిల్ రావిపూడి. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో బండ్ల గణేష్ , విజయశాంతి లు రీ ఎంట్రీ ఇస్తుండగా దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు యూనిట్.

More Related Stories