English   

జేమ్స్ బాండ్ సెట్ లో భారీ పేలుడు 

 JAMES BOND
2019-06-05 17:22:42

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సిరీస్ కి వీరాభిమానులు ఉన్నారు. హాలివుడ్ యాక్షన్ మూవీ సిరీస్ లో జేమ్స్ బాండ్ సినిమాలకి ఉన్నంత క్రేజ్ మరే సినిమాలకి లేదు. ప్రస్తుతం బాండ్ సిరీస్ లో ఇప్పుడు 25వ సినిమా రాబోతుంది. డానియెల్ క్రేగ్ అయిదోసారి జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకి క్యారీ జోజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 28న జమైకాలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయిన నాటి నుండి ఈ సినిమాకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.  కేరీ డైరెక్షన్ లో ఈ సినిమా షూట్ ప్ర‌స్తుతం బ్రిటన్‌లోని పైన్‌వుడ్‌ స్టూడియోస్‌ లో  జరుగుతోంది. కిడ్నాప్ కి గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే 25వ మూవీ ఈ లైన్ ఉండబోతోందని స‌మాచారం. అయితే సీన్‌లో భాగంగా సెట్‌లో ప‌రుగెత్తుతున్న‌ప్పుడు డేనియ‌ల్ కాలు మ‌డత‌ప‌డి కింద ప‌డిపోవ‌డంతో ఆయ‌న కాలికి తీవ్ర  గాయం అయింది. ఈ క్రమంలో ఈ సినిమా కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది. అయితే ఆయన కోలుకోవడంతో మళ్ళీ ఈ సినిమాకి సంబందిచి షూట్ మొదలు పెట్ట్టగా స్టంట్ సీన్స్ షూట్ చేస్తుండగా అక్కడ పేలుడు సంభ‌వించింది. దీంతో సెట్‌కి సంబంధించిన ఫ‌ర్నీచ‌ర్ మొత్తం అగ్నికి ఆహుత‌య్యాయి. సెట్ బ‌య‌ట నిల‌బ‌డిన ఓ వ్య‌క్తికి స్వ‌ల్ప గాయాలైన‌ట్టు తెలుస్తుంది.అయితే ఈ ఘ‌ట‌న‌లో క్రేగ్ ఏమయినా గాయాలు అయ్యాయా లేదా అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Related Stories