English   

ప్రియా ప్రకాష్ కి తెలుగు సినిమా ఆఫర్

priya
2019-06-05 19:59:05

ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా...అదేనండీ అప్పట్లో ఓ కన్ను గీటి దేశాన్నంతా తన వైపునకు తిప్పుకున్న ఈ కేరళ కుట్టి. ఒరు అదార్ లవ్ సినిమాలో ఓకే ఒక సాంగ్ లో ఆమె కన్ను గీటడం ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి దేశమంతా ఫిదా అయింది. నిజానికి ఆ కన్ను గీటుతో ఆమె చాన్నాళ్ళ పాటు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచింది.  కానీ ఆమె సినిమా మాత్రం మలయాళంలోనే కాదు రిలీజ్ అయిన మిగతా భాషల్లో కూడా ఆశించిన మేర ఆడలేదు. ఎన్నో అంచనాలతో తెలుగు సహా తమిళ బాషలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి యూత్ రెస్పాన్స్ ఉంటుందని భావించినా యూత్ నుంచి రెస్పాన్స్ కరువైంది. ఈ నేపథ్యంలో ఈ భామ బాలీవుడ్ లో ఛాన్స్ లు కొట్టేసింది. ఇక ఈ అమ్మాయికి ప్రస్తుతానికి తెలుగులో అవకాశాలు రాకపోవచ్చనే భావించారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఆమె అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిందట. తాజాగా ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ కొట్టేసిందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకున్న నితిన్ హీరోగా వరుస సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రశేఖర్ యేలేటితో నితిన్ చేసే సినిమాలో కథానాయికగా ప్రియా వారియర్ ను తీసుకున్నారని అంటున్నారు. నితిన్ 'భీష్మ' పూర్తయిన తరువాత, చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

More Related Stories