English   

శంకర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వడివేలు

vadivelu
2019-06-05 20:35:47

ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కమెడియన్ వడివేలు. చాలా కాలంగా కెమెరాకు దూరంగా ఉన్న ఆయనను కెమెరా ముందుకు వచ్చేలా చేసింది # Pray for nesamani. 18 ఏళ్ల క్రితం విడుదలైన ఫ్రెండ్స్ సినిమాలో నేసమణి అనే పాత్రతో ఆయన ఇప్పుడు ట్రెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన  ఓ ఇంటర్వ్యూలో శంకర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి శంకర్ కి వడివేలుకి మధ్య ఉన్న విభేదాలు ఇలా బయటపడ్డాయి. వ‌డివేలు హీరోగా రూపొందిన `హింసించే 23వ పులికేసి` సినిమాను తన శిష్యుడిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ శంక‌ర్ నిర్మించాడు. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య విభేదాలు త‌లెత్తిన‌ట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో క్లారిటీ రాలేదు, ఇక తాజాగా ఆయన శంకర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అవి నిజమే అని తేలింది. వడివేలు మాట్లాడుతూ కెరీర్ మొదలు నుండి గ్రాఫిక్ సీన్స్తోనే శంకర్ ద‌ర్శ‌కుడిగా నెట్టుకొస్తున్నాడని వడివేలు శంకర్ కేవ‌లం ఓ గ్రాఫిక్స్ డైరెక్ట‌ర్ మాత్ర‌మే అని, అంత‌కు మించి శంకర్ లో టాలెంట్ లేదని పేర్కొన్నాడు వడివేలు.

 

More Related Stories