English   

సెవెన్ మూవీ రివ్యూ 

Seven Review
2019-06-06 11:09:26

హవీష్ హీరోగా ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీని దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చిన సినిమా సెవెన్(7). మళయాళ నటుడు రెహమాన్ , యువ హీరో హవీష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి వంటి వారు నటించిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కధ :

కార్తీక్ (హవీష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అదే కంపెనీలో పనిచేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. కానీ ఓ రోజు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆమె లానే చెబుతూ మరో ఇద్దరు, జెన్నీ (అనిషా అంబ్రోస్), ప్రియా (త్రిథా చౌదరీ) కూడా తమ భర్త కార్తీక్ అని, ఆయన కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తారు. ఆ క్రమంలో ఒక హత్య జరగడం, కార్తీక్ ని కనిపెట్టలేక పోవడం పోలీసులకు సవాల్‌గా నిలుస్తుంది. దీంతో కార్తీక్ ని వేటాడడం మొదలు పెడతారు పోలీసులు. ఇంతలో కృష్ణమూర్తి అనే మరో పేరు బయటకు రావడం, అతను కూడా అచ్చం కార్తిక్ లానే ఉండడంతో సస్పెస్స్ ఏర్పడుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిలను మోసం చేసింది కార్తీకా ? లేక కృష్ణమూర్తినా ? అసలు కృష్ణమూర్తి ఎవరు ? అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రేమ కథలు ఒకేలా ఎందుకు ఉన్నాయి ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ :

మొదట మామూలు లవ్ స్టోరీల మొదలయిన సినిమా కాసేపటికే ఇంటరెస్టింగ్ గా మారుతుంది, కొత్త కధాంశం కావడం, ఎవరూ ఊహించలేని స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్లస్ పాయింట్, రొటీన్ కి భిన్నంగా ఈ సినిమాని మలచాలని దర్శకనిర్మాతలు బాగానే ప్రయత్నం చేశారు. అమ్మాయిలు ఒకరి మీదే ఓకే రకమైన ఫిర్యాదు చేయడం, కధ ప్రకారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని సస్పెన్స్ కి గురి చేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అలాగే రెజీనా పాత్రకు సంబంధించిన సీన్లు కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. కథనం విషయంలో చాలా నత్త నడకన సాగించారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం కూడా సినిమా మొతాన్ని దేబ్బెసింది. నటీనటుల విషయానికి వస్తే హవిష్ నటన ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. కీలక పాత్రలో నటించిన రెజీనా నటన గురించి వేరే చెప్పక్కర్లేదు, ఆమె ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చింది. అలాగే కీ రోల్ లో కనిపించిన నందితా శ్వేతా మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. మిగిలిన హీరోయిన్స్ కూడా అద్భుతమైన నటన కనబర్చారు. 

ఫైనల్ గా : ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ థ్రిల్లింగ్ గా ఉన్నా ఏదో మిస్సయ్యింది.

రేటింగ్ : 2.5/5

More Related Stories