English   

తన బాడీ గార్డ్ ని  కొట్టిన సల్మాన్....ముంచెత్తుతున్న ప్రసంశలు 

 Salman
2019-06-06 11:23:23

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమనిపించారు. అందరిలో ఉండగానే ఆయన తన గార్డ్‌మీద చేయి చేసుకున్నా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారినా సల్మాన్‌ మీద నెటిజన్లు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి తన గార్డ్‌ను కొడితే నెటిజన్లు ఆయన్ని పొగడటం ఏంటని అనుకుంటున్నారా ?. నిజానికి స‌ల్మాన్ ఖాన్ ,క‌త్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కిన చిత్రం భార‌త్‌. ఈద్ కానుక‌గా నిన్న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌డుతుంది. అయితే భారత్ మూవీ ప్రమోషన్ కోసం సల్మాన్ ముంబైలోని ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. కారు దిగి లోపలికి వెళుతుండగా అభిమానులు చుట్టుముట్టారు. వారిలో ఓ బాలుడు కూడా సల్మాన్‌ను చూసేందుకు వచ్చిన క్రమంలో సల్లూ భాయ్ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరు బాలుడ్ని పక్కకు తోసేశారు. దీంతో ఆ బాలుడు కింద ప‌డిపోగా క‌నీసం ఆయ‌న‌ని లేపే ప్ర‌య‌త్నం కూడా స‌ద‌రు బాడీగార్డ్‌ చేయకపోవద్మ్తో సీరియ‌స్ అయిన స‌ల్మాన్ బాడీ గార్డ్ చెంప చెళ్ళుమ‌నిపించాడు. ఈ ఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

More Related Stories