English   

మరో రీమేక్ ఒప్పుకున్నా విక్టరీ వెంకటేష్ 

Venkatesh
2019-06-06 12:44:33

ఒకప్పుడు రీమేక్ సినిమాలకి తెలుగు కేరాఫ్ అడ్రెస్ విక్ట‌రీ వెంక‌టేష్‌. తమిళ, మళయాల, హిందీ బాషల నుండి అనేక సినిమాల్ని రీమేక్ చేసి మంచి విజ‌యాలు సాధించాడు. అయితే ఈ మధ్హ్య కాలంలో ఆయన కాస్త సినిమాలు తగ్గించాడు. సక్సెస్ లు రావట్లేదనో ఇంకేదో కారణమో తెలీదు కానీ ఆయన సినిమాలు అయితే తగ్గించాడు, ఇక రీమేక్స్ ఇంకేం చేస్తాడు, అయితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజయిన ఎఫ్2 సినిమా హిట్ కొట్టడంతో మల్ల్లీ సినిమాల మీద ద్రుష్టి సారించాడు, ఈ క్రమంలో అయన ఇటీవ‌ల హిందీలో విడుద‌లై మంచి విజయం సాధించిన ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, రకుల్ ప్రీత్ సింగ్, అల‌నాటి అందాల భామ ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘దేదే ప్యార్‌ దే’అనే సినిమా తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. అకివ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో 50 ఏళ్ళ వ్య‌క్తి 26 ఏళ్ళ అమ్మాయితో లండన్‌లో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళే కధతో ఈ సినిమాని తెర‌కెక్కించారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ సినిమా మే 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మంచి టాక్ రావ‌డంతో వెంకీ రీమేక్ చేయాల‌ని భావించాడు. సురేష్ బాబు తాజాగా వెంకీ దేదే ప్యార్ దే చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌బోతున్నాడనే విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. నిన్న మూవీ మొఘల్ రామానాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు ప్రకటించారు.  

More Related Stories