English   

బాలీవుడ్ మిస్ గ్రానీ ఎవరబ్బా ?

O Baby
2019-06-06 17:43:10

అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ రీమేక్ ఓ బేబీ జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కొరియన్ బ్లాక్ బస్టర్ మిస్ గ్రానీకి రీమేక్ అయిన ఈ సినిమాను నందిని రెడ్డి తెరకెక్కించారు. 70 ఏళ్ల పెద్దావిడ ఒక ఇరవై ఏళ్ల యువతీగా మారితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ. ఓ రహస్య స్టూడియోలోకి వెళ్లిన ఒక పెద్దావిడ తనను తాను ఫొటో తీసుకుంటే ఆమె 20 ఏళ్ల అమ్మాయిలా మారిపోతుంది. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా ఇదిలా ఉంటే, ఈ ‘ఓ బేబీ’ సినిమాను నిర్మాత సురేష్ బాబు హిందీలో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో రీమేక్‌ చేయాడానికి శ్రద్ధ కపూర్, జాన్వి కపూర్ ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం సురేష్ బాబు వెంకీ మామ నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఓ బేబీ హిందీ రీమేక్‌ మీద సురేష్ బాబు పూర్తి దృష్టి పెట్టవచ్చని  అంటున్నారు. చూడాలి మరి బాలీవుడ్ గ్రానీగా ఎవరు మారనున్నారో ?

More Related Stories