English   

మరో హీరోతో కలిసి నటించనున్న నరేష్

Allari Naresh
2019-06-06 19:02:46

మల్టీ స్టారర్ అనలేం కానీ ఈ మధ్య తెలుగులో కూడా ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించడం, లేదా ఒకరి సినిమా కోసం మరొకరు అతిధి పాత్రలు అయినా చేస్తూ పోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే కామెడీ హీరో అల్లరి నరేష్ ఇటీవల ‘మహర్షి’లో మంచి పాత్ర పోషించారు. మహేష్ బాబు స్నేహితుడిగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక ఇప్పుడు ఆయన రవితేజ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమాను రవితేజ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ స్నేహితుడి పాత్ర కోసం అల్లరి నరేష్‌ను తీసుకున్నారని అంటున్నారు. ఈ రోల్ సినిమాకు చాలా కీలకమట. గతంలో రవితేజ, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో ‘శంభో శివ శంభో’ సినిమా రాగా ఇది రెండో సినిమాగా నిలవనుంది. ఇక డిస్కో రాజాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని నేల టికెట్ సినిమా నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  

More Related Stories