English   

మళ్ళీ పెళ్లి చేసుకున్న చిరంజీవి మాజీ అల్లుడు

sirish
2019-06-06 21:29:08

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరికి కుటుబం నుండి సరయిన సపోర్ట్ లభించలేదు, అప్పట్లో పవన్ అయితే గన్ మీడియా ముందుకు తెచ్చి మరీ హడావిడి చేశారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని విబేధాలు రావడంతో 2012 లో శిరీష్ మీద కేసు పెట్టిన శ్రీజ 2014 లో విడాకులు తీసుకుని ప్రముఖ వ్యాపార వేత్త తనయుడు కళ్యాణ్ దేవ్ ని 2016 మార్చి 28న పెళ్ళి చేసుకుంది. అయితే శ్రీజ మాజీ భర్త శిరీష్ కూడా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా శిరీష్ సోష‌ల్ మీడియా ఎకౌంట్‌లో ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఆమె శిరీష్ భార్య‌నే అయి ఉంటుంద‌ని నెటిజ‌న్స్ ఫిక్స్ అవుతున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనతో ఆయన వివాహం జరిగిందట. శిరీష్ -శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరివురు విడిపోయిన త‌ర్వాత పాప శ్రీజ ద‌గ్గ‌రే ఉంటుంది. కళ్యాణ్ దేవ్ కూడా ఆ పాపను కన్నకూతురిలా చూసుకుంటున్నారు. ఇక శ్రీజతో విడిపోయాక శిరీష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బిజెపి పార్టిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.

More Related Stories