English   

కాజల్ ఆ సినిమా నుండి తప్పుకోలేదా ?

Kajal Aggarwal
2019-06-07 13:09:28

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కాజల్ ఒకరు. ఈ మధ్యనే తేజ డైరెక్షన్ లో సీత సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది కాజల్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భారతీయుడు 2లో నటిస్తోంది. శంకర్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జూన్ 1 నుంచి తాను భారతీయుడు 2 సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతానని ప్రకటించింది కాజల్. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎటువంటి వార్తా బయటకు రాలేదు. దీంతో చాలాసార్లు వాయిదా పడుతూ సెట్స్‌పైకి వెళ్లిన భారతీయుడు 2 చిత్రం నుంచి కాజల్ తప్పుకుందనే ప్రచారం కోలీవుడ్‌ మీడియాలో అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, కాజల్ ఈ సినిమా నుండి తప్పుకోలేదని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అదీ కాక ఆమె ఈ సినిమాతో పాటు తమిళంలో మరో సినిమా కూడా చేస్తోందట. జయం రవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి 'కోమలి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీంతోపాటు సుధీర్‌వర్మ-శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న ‘రణరంగం’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.  

More Related Stories