English   

మెగా హీరో సినిమాలో అక్కినేని హీరో....క్రేజీ కదా

 Sushanth
2019-06-07 13:20:27

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుండే అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్ లో మూడో సినిమా కావడం మొదటి రెండు సినిమాలు బంపర్ హిట్స్ కావడం ఈ సినిమా మీద ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఒకటి వచ్చింది. ఇందులో అక్కినేను హీరో సుశాంత్‌ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటిస్తూ ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. నిజానికి కరెంట్ సినిమా తర్వాత దాదాపుగా కనుమరుగు అయిపోయిన సుశాంత్  చిలసౌ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. అయితే చిలసౌ వచ్చి ఏడాది అవుతున్నా ఆయన కొత్త సినిమా ఏమీ అనౌన్స్ చేయలేదు. ఇక అలాంటిది ఏమీ ఉండడేమో అని అనుకుంటుండగానే అయన తాజాగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఆయన ట్వీట్ ప్రకారం ఆయన ఈరోజు అల్లు అర్జున్‌ 19వ సినిమా షూట్ కి వెళుతున్నారు. అయితే సినిమా గురాయించి ఎక్కువ విషయాలు చెప్పే అవకాశం లేకపోవడంతో ఆయన తక్కువలో తనకి ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్‌తో, ‘ఆర్య’ సినిమా నుంచి నేనెంతో ఆరాధిస్తున్న బన్నీతో, పవర్ హౌస్ లాంటి టబు, నా స్నేహితురాలు పూజా హెగ్డే, పీఎస్‌ వినోద్‌, తమన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని. నాకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ‘చిలసౌ’ తర్వాత ఈ సినిమా నాకు మరో ప్రయోగం లాంటిదే అని పేర్కొన్నాడు, ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ తో బాటుగా, హారికా హాసినీ సంస్థ కూడా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇప్పటికే చాల గ్యాప్ తీసుకున్న యూనిట్. తాజాగా హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ చేశారు. నిజానికి రెండు సినీ కుటుంబాలకి చెందిన నటులు ఓకే సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

More Related Stories