English   

సుదీప్ పహిల్వాన్ కి ఉపయోగపడుతున్న సైరా 

Sye Raa
2019-06-07 15:29:23

ఈగ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు సుదీప్. ఆ తర్వాత బాహుబలిలో గుర్తుండిపోయే అస్లాం ఖాన్‌ పాత్ర చేసి మరింత దగ్గరయ్యాడు. ఇక అయన ప్రస్తుతం ఆయన మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క సుదీప్ హీరోగా ‘పహిల్వాన్’ అనే కన్నడ సినిమా రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఈ సినిమాని కన్నడతో పాటే తెలుగులో కూడా పహిల్వాన్ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సుదీప్ కుస్తీవీరుడుగా కనిపించనున్నారు. తెలుగు మాత్రమే కాదు ఈ సినిమాని హిందీ, తమిళం, మలయాళంతో కలుపుకుని మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈయన తెలుగు సినిమాకి మెగా స్టార్ చిరంజీవి ప్రచారం చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.  అయితే తెలుగులో చిరంజీవి ఈ సినిమా ప్రమోట్ చేస్త్జింటే తమిళ్ లో విజయ్ సేతుపతి ప్రమోట్ చేస్తున్నారు. తమిళంలో ‘బయిల్వాన్’గా విడుదలవుతోంది. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్వప్నపహిల్వాన్ నేతృత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. అర్జున్ జన్యా సంగీతం అందించనున్నారు. సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా కబీర్ దుహాన్ సింగ్ విలన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారట. అలా సుదీప్ సినిమాకి సైరా టీం ప్రమోట్ చేస్తున్నారన్న మాట. 

More Related Stories