English   

ఇంద్రలో కత్తి పట్టి తొడ కొట్టిన బుడ్డోడు…సమంతకి మనవడయ్యాడు ! 

Teja
2019-06-07 16:22:03

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చూసిన‌వాళ్లెవ్వ‌రూ ఆ సినిమాలోని బాల న‌టుడు తేజ‌ను మర్చిపోలేరు. ఈ నటుడు తేజ అంటే గుర్తు పట్టక పోవచ్చు కానీ ఆ సినిమాలో కత్తి పట్టి తొడ కొట్టిన బుడ్డోడి గా అందరికీ సుపరిచితమే. ఈ సినిమాతో తేజకు ఎంతో గుర్తింపు ల‌భించింది. ఇంద్ర‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో తేజ బాల‌న‌టుడిగా అల‌రించాడు. చూడాల‌ని ఉంది, యువ‌రాజు, వ‌సంతం, శ్రీరామ‌దాసు లాంటి సినిమాల‌తో మెప్పించిన తేజ త‌ర్వాత వెండితెర‌కు దూర‌మ‌య్యాడు. ప‌న్నెండేళ్ల క్రితం శ్రీరామ‌దాసులో న‌టించిన బాల తేజ ఇప్పుడు పెరిగి పెద్ద‌యి టీనేజ్ కి వచ్చేశాడు. దీంతో మనోడు ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. సమంతా హీరోయిన్ గా నటించిన 'ఓ బేబీ' సినిమాలో సమంతకు మనవడిగా తేజ కీలక పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజను గుర్తుపట్టి మీడియా పలకరించగా ఆయన  తాను మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించానని తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఇదే మొదటి సినిమా అని చెప్పుకొచ్చారు. ఇక మనిషికి సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుందని, ఓల్డ్ ఏజ్ లో కనిపించే సమంతకు తాను మనవడినని చెప్పాడు. అయితే నిజానికి మనోడు హీరోగా లాంచ్ కావాల్సి ఉంది. ఆయన ప్ర‌శాంత వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా ప‌రిచ‌యం అవుతాడ‌న్న ప్రచారం జరిగింది. అది తెరకెక్కిక పోగా ఆ తర్వాత  ఓ ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడని ఫిలింన‌గర్ వ‌ర్గాలలో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సమంతా మనవడిగా మారాడు తేజ.

More Related Stories