English   

వామ్మో ఆ సీన్ కోసం అంత బడ్జెట్ ? జక్కన్నకే సాధ్యమేమో ?

Rajamouli
2019-06-07 16:47:41

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో చరణ్ లు కధానాయకులుగా భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ - కొమరం భీమ్, చరణ్ - అల్లోరి సీతారామరాజుగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ఈ మధ్యనే హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ రహస్యంగా మొదలు పెట్టారు, ఇక చరణ్ కూడా తన వెకేషన్ నుండి వచ్చేయడంతో ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం 2000 మంది దేశీ, విదేశీ జూనియర్ అర్టిస్టుల నడుమ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని  రాజమౌళి చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్ లో ఎన్టీఆర్, చరణ్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే 45 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఈ సీన్ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్  అయిన తరవాత ఇక్కడే ఒక సాంగ్ షూట్ చేసి బల్గేరియా దేశానికీ షూట్ కోసం వెళ్లనున్నారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ వుంటుంది. తెలుగు, తమిళ, బాలీవుడ్ కి చెందిన స్టార్స్ ముఖ్య పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. ఆయనకు జోడీగా విదేశీ నటి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది.

More Related Stories