English   

మరో మెగా హీరో సినిమాలో తమిళ హీరోయిన్ 

Nivetha Pethuraj
2019-06-07 18:51:43

మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమిళ పొన్ను నివేదా పేతురాజ్‌. ఈ మధ్యనే చిత్రల‌హ‌రి సినిమాలో న‌టించి ఆక‌ట్టుకుంది. ఈ సినిమా మెగా హీరోకి మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు నివేదా పేతురాజ్‌కు తెలుగులో మ‌రో మెగా అవ‌కాశం వ‌చ్చింది. స్టైలిష్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ న‌టించ‌నుంద‌ని ప్రచారం జరగగా దానిని నిజం చేస్తూ ఆమె సినిమాలో నటిస్తుదని ప్రకటన చేసింది సినిమా యూనిట్. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ సెకండ్ హీరోయిన్ పాత్ర‌లో కనిపిస్తుందా ?  లేక ఏదైనా స్పెషల్ రోలా? అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.  ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్‌ గానే మొదలయ్యింది. జులాయి, స‌న్నాప్ స‌త్య‌మూర్తి వంటి హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా మీద భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి

More Related Stories