English   

రోజాకు ఊహించని షాక్ ఇచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి..

jagan
2019-06-07 20:48:27

పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటుంది రోజా. తెలుగు దేశం నుంచి రాజీనామా చేసి వచ్చిన తర్వాత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది ఈ మాజీ నటి. ఆ తరువాత ఆయన చనిపోయాక వైయస్ జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతుంది రోజా. ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈమె 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా మరోసారి అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తుంది రోజా. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈమెకు ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి వస్తుందని అంతా ఊహించారు. అయితే ఈ రోజు జగన్ ప్రకటించిన కేబినెట్లో రోజాకు లేకపోవడంతో నిరాశ పడుతున్నారు ఆమె అభిమానులు. వైసీపీ నేతల్లో కూడా చాలామంది జగన్ క్యాబినెట్ లో రోజా లేకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తిరుమలకు వచ్చిన వైయస్ జగన్ తో వై వి సుబ్బారెడ్డి, రోజా మాత్రమే ఉన్నారు. దీన్నిబట్టి ఆమె ఆ పార్టీలో ఎంత కీలక సభ్యురాలో అర్థమవుతుంది. ఇలాంటి ముఖ్య నేత కాకుండా ఇతరులందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు వైయస్ జగన్. ఈ నిర్ణయంపై కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న కూడా మంత్రి పదవి రాదు అనే విషయం తనకు ముందే తెలుసు అనేది మరికొందరు చెబుతున్న మాట. ఆమెకు ఆ విషయం తెలిసి జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా కొనసాగడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ఒకవేళ మంత్రి పదవి హామీ వచ్చి ఉంటే కచ్చితంగా జబర్దస్త్ నుంచి ఆమె బయటకు వచ్చేదని వార్తలు వినిపిస్తున్నాయి. అలా జరగలేదు కాబట్టి ఆమెకు మంత్రి పదవి రాదు అనే విషయం ముందే జగన్ చెప్పేశాడని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వైసీపీ తరఫున లేడీ హిట్లర్ లా ఉన్న రోజాను క్యాబినెట్ లోకి తీసుకోకపోవడం నిజంగానే ఆశ్చర్యం. మరి దీనిపై ఎమ్మెల్యే రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Related Stories