English   

ఇస్మార్ట్ శంకర్ నుండి ఫస్ట్ లిరికల్...దుమ్ము రేపుతోంది

ram
2019-06-07 21:10:10

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ‘డబుల్ దిమాక్ హైద‌ర‌బాది’ అనే ట్యాగ్ లైన్‌ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ మార్క్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్మొదలు పెట్టిన సినిమా యూనిట్ ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఓ మాస్‌ పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. 'సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక .. పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక " అంటూ మొదలవుతున్న ఈ పాట దుమ్ము రేపుతోంది. కేవలం మాస్ ఆడియన్స్ నే దృష్టిలో పెట్టుకుని, ఇద్దరు హీరోయిన్స్ అలాగే రామ్ కాంబినేషన్లో వచ్చిన పాట ఇది. మణిశర్మ సంగీతం, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం, కీర్తన శర్మ - సాకేత్ గాత్రంతో ఈ పాట మొత్తానికి మంచి ఊపు తెప్పిస్తోంది సినిమాకి. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ కి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయంలో ఆయన అభిమానులు వున్నారు. నిజానికి ఈ సినిమా హిట్ కొట్టడం అటు పూరీకి ఇటు రామ్ కీ ఇద్దరికీ చాలా అవసరం. ఏమవుతుందో చూడాలి మరి.

 

More Related Stories