English   

ఆ హీరోయిన్ ని ఎన్టీఆర్ పేరు చెప్పి మోసం చేశారట..

ntr
2019-06-07 21:39:11

ఇండస్ట్రీ అంటేనే మాయాజాలం.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించే ఓ మంత్రం. ఇంక అక్కడ ఉండాలంటే ఇంకెన్ని మాయలు మంత్రాలు తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే కచ్చితంగా ఇక్కడ వెనుకబడి పోవడం ఖాయం. ఈ మధ్య కాలంలో ఒక టాప్ హీరోయిన్ విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. సదరు టాప్ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఆ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా సూపర్ స్టార్ గా కొనసాగుతుంది. అంతేకాకుండా తాను కేవలం మంచి సినిమాలు మాత్రమే చేస్తానంటూ చెప్పి ఎక్స్ పోజింగ్ కు కూడా దూరంగా ఉంటుంది సదరు టాప్ హీరోయిన్. పారితోషికం విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాకు రెండు కోట్లకు పైగానే తీసుకుంటుంది.

అలాంటి హీరోయిన్ ఈ మధ్య ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఒకే చేసింది. అయితే ఆ సినిమా సదరు హీరోయిన్ ఒప్పుకోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. సినిమా ఓకే చేసే ముందే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అతిధి పాత్ర చేస్తాడు అంటూ ఆ హీరోయిన్ కు చెప్పి దర్శక నిర్మాతలు నమ్మించారని ప్రచారం జరుగుతోంది. కానీ సినిమా మొదలైనా.. ఆ తర్వాత 80 శాతం షూటింగ్ పూర్తయిన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ రాకపోవడంతో ఆ హీరోయిన్ కి చిర్రెత్తుకొచ్చి షూటింగ్ కు రావడం మానేసిందని తెలుస్తోంది. దాంతో ఆమె మిగిలిన సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి ఆ దర్శక నిర్మాతల తల ప్రాణం తోకలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న రాజమౌళి సినిమా తర్వాత తమ తోనే ఆయన సినిమా చేయబోతున్నాడని అందులో మీకు హీరోయిన్ వేషం ఇప్పిస్తామని చెప్పి మిగిలిన సినిమా పూర్తి చేయడానికి దర్శక నిర్మాతలు తంటాలు పడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ పేరుకు సంబంధం ఏంటి అనేది అసలు సస్పెన్స్..

More Related Stories