English   

తెలుగు ఇండస్ట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తాప్సి..

tapsee
2019-06-07 22:29:28

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేదు. ఇక్కడ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్లలో ఈమె కూడా ఉంది. తెలుగులో కోరుకున్న గుర్తింపు రాక పోయినా కూడా బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంటుంది తాప్సీ. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ తో వరుస సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన నటనతో ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అంతే చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటుంది. ఆ మధ్య తెలుగులో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది తాప్సి. ఆయనకు బొడ్డు మీద పళ్ళతో కొట్టడం సరదా అంటూ కామెంట్స్ చేసి అందరితోనూ తిట్టించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీపై కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా కూడా తాను తెలుగు ఇండస్ట్రీని బాగా మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. దానికి కారణం ఇక్కడ హీరోయిన్లకు ఇచ్చే గౌరవం అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇచ్చే గౌరవంతో పోలిస్తే బాలీవుడ్ లో సగం కూడా ఇవ్వరని.. ఇక్కడ తాము కార్ వ్యాన్ లో నుంచి రాగానే అందరూ లేచి నిల్చుని గౌరవిస్తారని.. దాంతో తమకు తామే ఒక దేవత లా ఫీల్ అయిపోతాము అంటూ సెటైర్లు వేసింది తాప్సీ. అందుకే తాను తెలుగు ఇండస్ట్రీని బాగా మిస్ అవుతున్నానని.. అయితే ఇక్కడ తన నటనకు సరిపోయే పాత్రలు దర్శక నిర్మాతలు చాలా కాలం నుంచి ఇవ్వలేదని కేవలం గ్లామర్ కోణాన్ని మాత్రమే అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఈమె తెలుగు ఇండస్ట్రీని తిట్టిందా పొగిడిందా అని అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు విశ్లేషకులు.

More Related Stories