English   

రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘంష్ అరంగేట్రం..

raj
2019-06-07 22:46:04

తెలుగు ఇండస్ట్రీలో వారసులకు ఎప్పుడూ కొదవలేదు. ఎప్పటికప్పుడు కొత్త వారసులు పుట్టుకొస్తూనే ఉంటారు. తాజాగా మరో వారసుడు కూడా తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు. అతడే మేఘంష్ సన్నాఫ్ రియల్ స్టార్ శ్రీహరి. ఆరేళ్ళ క్రితమే శ్రీహరి కన్నుమూసిన కూడా ఇప్పటికే ఆయన్ని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఆ అభిమానంతోనే ఇప్పుడు శ్రీహరి కుమారుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈయననటిస్తున్న తొలి సినిమా రాజ్ ధూత్ టీజర్ విడుదలైంది. కార్తీక్ అర్జున్ ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. కచ్చితంగా తొలి సినిమాతోనే విజయం అందుకుంటానని ధీమాగా కనిపిస్తున్నాడు రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు. తండ్రి పేరు నిలబెట్టడానికి తాను శాయశక్తులా కృషి చేస్తాను అంటున్నాడు ఈ కుర్రాడు. మర్యాద రామన్న సినిమా తరహాలోనే ఇందులో ఒక బైక్ గురించి చూపిస్తున్నారు. అక్కడ సైకిల్ ఎక్కిన సునీల్ ఇక్కడ మోటార్ సైకిల్ కు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. టీజర్ మొత్తం సునీల్ వాయిస్ తోనే నడిచింది. మేఘంష్ తొలి సినిమా స్టార్ కాస్ట్ బాగానే ఉంది. కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, ఏడిద శ్రీరామ్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మాజీ మిస్ ఇండియా ప్రియాంకా వర్మ, నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. టీజర్ చూస్తుంటే ఒక బైక్ చుట్టూ తిరిగే కథ అనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. మరి రాజ్ ధూత్ సినిమాతో శ్రీహరి తనయుడు ఇండస్ట్రీ ఇలాంటి ఎంట్రీ ఇస్తారా అనేది ఆయన అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

More Related Stories