English   

కామెడీగా సాగుతున్న థ్రిల్లర్ ట్రైలర్ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

agent
2019-06-08 08:46:44

వన్ నేనొక్కడినే, ‘డీ ఫర్‌ దోపిడీ’, ‘లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌’ సినిమాల్లో నటించిన న‌వీన్ పోలిశెట్టికి ఆ సినిమాల్లో నటించినా అంతగా పేరు రాలేదు, అయితే బాలీవుడ్ కి షిఫ్ట్ అయి అక్కడ కొన్ని వెబ్ సిరీస్ లు లాంటివి చేస్తూ పాపులర్ అయ్యాడు. తాజాగా అయన హీరోగా రూపొందిన మూవీ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వ‌రూప్ ఆర్ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ని నిన్న విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల చేశారు. ఆ ట్రైలర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది, న‌వీన్ డిటెక్టివ్ పాత్రలో న‌టించిన ఈ సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగతుందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే నేపథ్యంలో ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు తెలుసుకున్న న‌వీన్ వాటిని ఎలా సాల్వ్ చేస్తాడ‌నేది ట్రైలర్ ని బట్టి హింట్ ఇచ్చినట్టు అర్ధం అవుతోంది. ఇక మళ్ళీ రావా లాంటి లవ్ ఎంటర్టైనర్ ని నిర్మించిన రాహుల్ యాద‌వ్ న‌క్క నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక ఈ సినిమాకి మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్రఫీ అందించారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి .

 

More Related Stories